SS Kumaran : తాజాగా నయనతార(Nayanthara) – ధనుష్(Dhanush) వివాదం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతార లైఫ్ ని డాక్యుమెంటరీగా నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో నేను రౌడీనే సినిమాకు సంబంధించిన వర్కింగ్ వీడియో వాడటంతో ఆ సినిమా నిర్మాత ధనుష్ ఆమెకు పది కోట్లు కట్టమని లీగల్ నోటిస్ పంపించాడు. దీంతో నయనతార బహిరంగంగా ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, తిడుతూ ఓ లెటర్ ని పోస్ట్ చేసింది.
దీంతో ఈ లెటర్ తమిళ సినీ పరిశ్రమలో చర్చగా మారింది. నయనతారపై ధనుష్ ఫ్యాన్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నువ్వు మాత్రం నీ లైఫ్ స్టోరీని కోట్లకు అమ్ముకోవచ్చు కానీ, ఆయన సినిమాది వాడుకుంటే డబ్బులు అడగకూడదా అని నయన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఓ తమిళ నిర్మాత కూడా నయనతార, అతని భర్తపై ఫైర్ అవుతూ ఓ లేఖ విడుదల చేసారు.
తమిళ నిర్మాత SS కుమారన్.. ధనుష్ అనుమతి లేకుండా మీరు ఫుటేజీ వాడితే మీకు నోటిస్ పంపిస్తే తప్పని తిడుతున్నావు. మరి మీ ఆయన చేసిందేంటి. LIC అనే సినిమా టైటిల్ నేను రిజిష్టర్ చేయించుకున్నా కూడా మీరు అదే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మీరు టైటిల్ కోసం నా దగ్గరికి వస్తే సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరు అదే టైటిల్ వాడుకుంటున్నారు. మరి నేను ఏమనాలి. నేను చిన్న ప్రొడ్యూసర్ ని కాబట్టి మీరు నన్ను తొక్కేశారు. మీరు దీనికి సమాధానం చెప్పాలి. మీ వల్ల చాలా మానసిక క్షోభ అనుభవించాను నేను. మీరు చేసిన పని నా సినిమాపై కూడా ప్రభావం చూపించింది. ప్రతి నిర్మాత తన సినిమాల కోసం డబ్బు, సమయం ఖర్చు చేస్తాడు. మీ వ్యాపార ప్రయోజనాల కోసం ఆ సినిమాల నుంచి వాడుకుంటే డబులు చెల్లించాల్సిందే అని అన్నారు. నువ్వు, మీ ఆయన మాత్రం ఫ్రీగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో కుమారన్ లెటర్ కూడా తమిళ పరిశ్రమలో చర్చగా మారింది. మరి నయనతార – ధనుష్ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Also Read : Tilak Varma : పుష్ప 3లో నటిస్తావా? అల్లు అర్జున్ లాగా ఉన్నావు.. తిలక్ వర్మను ప్రశ్నించిన సూర్యకుమార్ యాదవ్..