Allu Arjun బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్ తన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఒక కామెంట్ రాసుకొచ్చారు. కష్ట సమయాల్లో తన కోసం వచ్చి సపోర్ట్ గా ఉన్నందుకు థాంక్స్ అని అన్నారు SKN. ఇటీవలే తండ్రిని కోల్పోయారు ఎస్.కె.ఎన్. ఈమధ్యనే కార్యక్రమాలు అన్నీ ముగించారు. అయితే ఇలాంటి టైం లో ఎస్.కె.ఎన్ ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలుకరించారు అల్లు అర్జున్. తన అభిమాన హీరో రాకతో ఎస్.కె.ఎన్ సంతోష పడ్డారు.
We’re now on WhatsApp : Click to Join
అంతేకాదు ఇలాంటి టైం లో నా ఇంటికి వచ్చినందుకు ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మీ కైండ్ నెస్, సపోర్ట్ కు ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఎస్.కె.ఎన్ ఆ సినిమా రిలీజ్ టైం లో వార్తల్లో నిలిచారు.
ఈమధ్యనే ఎస్.కె.ఎన్ తన బ్యానర్ లో కొత్త సినిమా ప్రకటించారు. కల్ట్ బొమ్మ టైటిల్ ని కూడా SKN రిజిస్టర్ చేశారని తెలుస్తుంది. బేబీ తర్వాత మరికొన్ని లో బడ్జెట్ లవ్ స్టోరీస్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు SKN.
Also Read : Animal OTT Release : ఆల్ క్లియర్ ఫర్ యానిమల్ ఓటీటీ రిలీజ్.. వాళ్లకిక పండుగే..!