Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలిస్తే.. ఆమె భర్తకు ఆటో గిఫ్ట్ ఇస్తానంటున్న నిర్మాత..

పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత ఊరంతా పార్టీ ఇస్తానన్న మహిళ భర్తకు ఆటో గిఫ్ట్ ఇస్తానంటున్న నిర్మాత.

Published By: HashtagU Telugu Desk
Producer Skn Said He Buy A Auto For A Women Husband Who Support Pawan Kalyan

Producer Skn Said He Buy A Auto For A Women Husband Who Support Pawan Kalyan

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఇక ఫలితాలు రావడమే ఆలస్యం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం ఫార్మ్ చేస్తుంది అనే దానికన్నా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన దగ్గర నుంచి పిఠాపురం ప్రజల.. పవన్ గెలుపు తమ భాద్యత అన్నట్లు హామీలు ఇస్తూ వచ్చారు.

కాగా పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ఒక పేద మహిళ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో ఆమె మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యి.. నిర్మాత SKN వరకు వెళ్ళింది. ఆ వీడియో చూసిన ఆ నిర్మాత రియాక్ట్ అవుతూ.. “మా నాయకుడు కళ్యాణ్ గారు పై ఆమె చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకు బహుమతిగా రేపు కళ్యాణ్ గెలిచిన తరువాత ఆమె భర్తకు నేను ఆటో కొనిస్తాను” అంటూ ట్వీట్ చేసారు.

ఇక ట్వీట్ పై దర్శకుడు మెహర్ రమేష్ రియాక్ట్ అవుతూ.. “తమ్ముడు SKN నువ్వు ఆ ఆటో ఇప్పుడే బుక్ చేసుకొని పెట్టుకొని జూన్ 4 వరకు వెయిట్ చెయ్యి. నీ గొప్ప మనసుకి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేసారు. మరో దర్శకుడు మారుతీ రియాక్ట్ అవుతూ.. “నువ్వు మంచి మనసు ఉన్న వ్యక్తివి డార్లింగ్. నీ మనసే నీ మంచితనం” అంటూ కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  Last Updated: 14 May 2024, 09:27 AM IST