Site icon HashtagU Telugu

Producer SKN : సరదాగా ఫ్లోలో అన్న మాటలకు వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Producer SKN

Producer SKN

Producer SKN : ఇటీవల సినిమా ఈవెంట్స్ లో స్టేజిపై సరదాగా మాట్లాడిన మాటలను పలువురు సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రమోట్ చేసి వివాదం సృష్టిస్తున్నారు. మొన్న లైలా ఈవెంట్లో పృద్వి రాజ్ సరదాగా మాట్లాడిన కామెంట్స్ కి ఏకంగా బాయ్ కాట్ లైలా అన్నారు. చిరంజీవి నాకు మనవడు కావాలి అని కోరుకుంటే అమ్మాయిలు ఏం తక్కువ అంటూ హడావిడి చేసారు. ఇక నిన్న నిర్మాత SKN కామెంట్స్ కూడా వివాదం చేసారు.

ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నిర్వహించగా నిర్మాత SKN గెస్ట్ గా రాగా ఈవెంట్లో ఆ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. మా తెలుగు వాళ్ళు వేరే హీరోయిన్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తాం. తెలుగు హీరోయిన్స్ ని మేము ఎంకరేజ్ చేయం. చేస్తే ఏమవుతుందో చూస్తున్నాం. అందుకే నేను, సాయి రాజేష్ తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నాం అని అన్నాడు.

దీంతో పలువురు ఈ వ్యాఖ్యలను వివాదంగా మార్చారు. తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ అని, SKN అంతకుముందు సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యతో ఏదైనా ఇబ్బంది వచ్చిందా? తెలుగు అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకోవట్లేదా అంటూ ట్రోల్స్ చేసారు. ఇక SKN ని విమర్శించే వాళ్ళు కూడా దొరికిందే ఛాన్స్ అని ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఓ విలేఖరి.. సరదా కోసమో, ఫ్లోలో చెప్పడంలోనే ఓ కాంట్రావర్సీకి రూట్ వేసే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవీ చైతన్యకు ముడిపెట్టి చూడడం సరి కాదేమో? అని పోస్ట్ చేసారు. దీనికి నిర్మాత SKN సమాధానమిస్తూ.. హ హ హ ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ ఏం చేస్తాం చెప్పండి అని రాసుకొచ్చారు. దీంతో నిర్మాత SKN సరదగా అన్న మాటలు అని, అనవసరంగా వివాదం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చేసాడు.

అయితే మామూలుగానే నిర్మాత SKN ఇప్పటివరకు పరిచయం చేసిన వాళ్లంతా తెలుగు హీరోయిన్సే. రేష్మ, ప్రియాంక జవాల్కర్, మానస, వైష్ణవి చైతన్య.. ఇలా తెలుగు వల్లనే పరిచయం చేసాడు. తన రాబోయే సినిమాల్లో కూడా హారిక అలేఖ్య, ఐశ్వర్య, కుషిత కళ్లపు.. తెలుగు వల్లనే పరిచయం చేస్తుండటం గమనార్హం.

 

Also Read : Mythri Movie Makers : టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు తమిళ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..