Site icon HashtagU Telugu

Producer SKN : లోకల్ ఛానల్ లో గేమ్ ఛేంజర్ టెలికాస్ట్.. ఫైర్ అయిన నిర్మాత..

Producer SKN Fires on Game Changer Piracy

Skn

Producer SKN : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజయింది. అయితే ఈ సినిమాకి పైరసీ దెబ్బ పడింది. కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ముందు నుంచి మూవీ టీమ్ ని సినిమాని లీక్ చేస్తామని బెదిరిస్తూ సినిమాని పైరసీ చేశారు. ఇప్పటికే దీనిపై మూవీ యూనిట్ పలువురిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.

ఈ సినిమా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ లో టెలికాస్ట్ చేయడంతో ఫ్యాన్స్, నిర్మాతలు మండిపడుతున్నారు. తాజాగా ఓ లోకల్ కేబుల్ ఛానల్ లో గేమ్ ఛేంజర్ సినిమా టెలికాస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై మెగా అభిమాని, నిర్మాత SKN ఫైర్ అవుతూ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

SKN తన ట్వీట్ లో.. కేవలం 4 రోజుల క్రితం రిలీజయిన సినిమా లోకల్ ఛానల్, బస్సుల్లో టెలికాస్ట్ అవ్వడం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. సినిమా అంటే కేవలం ఒక హీరో, డైరెక్టర్, నిర్మాత కాదు. ఓ మూడు నాలుగు సంవత్సరాల కష్టం. వేలమంది కల, కష్టం. ఇది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, సినిమా పైనే ఆధారపడి జీవించే వారిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సంఘటనలు సినిమా భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమా భవిష్యత్తు కోసం అందరూ పోరాడాలి అని తెలిపారు.

దీంతో SKN ట్వీట్ వైరల్ కాగా మెగా అభిమానులు కూడా గేమ్ ఛేంజర్ పైరసీ పై ఫైర్ అవుతున్నారు. మూవీ యూనిట్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.

 

Also Read : Anand – Vaishnavi : మళ్ళీ బేబీ కాంబో.. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య సినిమా అనౌన్స్.. ఆ సిరీస్ కి సీక్వెల్..?