Site icon HashtagU Telugu

Tollywood : ‘బేబీ’ నిర్మాత ఇంట విషాద ఛాయలు

Skn Father

Skn Father

ప్రముఖ నిర్మాత SKN ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాష్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మెగా ఫ్యామిలీ (Mega Family) అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన SKN.. ముందుగా పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి..ఆ తర్వాత టాక్సీవాలా, కలర్ ఫొటో, ప్రతి రోజు పండుగే, బేబీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

We’re now on WhatsApp. Click to Join.

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరిగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒక సాధారణ జర్నలిస్టుగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత అంచలంచేలుగా ఎదుగుతూ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తున్నారు. చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈయన బేబీ (Baby) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని. లాభాల బాటలో పయనిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సినీ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ప్రస్తుతం మారుతి, రాహుల్ సాంకృత్యాన్, సాయి రాజేష్ వంటి సక్సెస్ఫుల్ దర్శకులతో సినిమాలు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

Read Also : Jagan at Lotus Pond : రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ ఇంటికి జగన్..