Pawan-Bunny : పవన్ కళ్యాణ్..అల్లు అర్జున్ పై ఆ వ్యాఖ్యలు అనలేదు – నిర్మాత క్లారిటీ

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు 'పుష్ప 2' గురించి కాదని, పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని

Published By: HashtagU Telugu Desk
Bunny Pawan Ravikumar

Bunny Pawan Ravikumar

గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్..దగ్గరి నుండి మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడం వరకు ఇరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఆ మధ్య సినిమాల్లోని సాంస్కృతిక మార్పులను, కొన్నేళ్లుగా హీరోల చిత్రణను వివరించారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పుడు సినిమాల్లో చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ నటించిన గంధడ గుడి చిత్రంలో అడవుల సంరక్షణ గురించి మాట్లాడారని పవన్‌ ఎత్తిచూపారు. స్మగ్లర్ల నుంచి అడవిని కాపాడే ఫారెస్ట్ ఆఫీసర్ కథే ఈ సినిమా అని తెలిపారు. “సంస్కృతి ఎలా మారిందో నేను ఇటీవల నా అధికారులతో పంచుకున్నాను. నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడే వాడు వీరుడు. ఇప్పుడు అడవులను నరికి భూమిని నాశనం చేసే వాడిని హీరో అంటారు’’ అని పవన్ అన్నారు. తాను కూడా సినిమా ఫీల్డ్‌లో భాగమేనని, ఇలాంటి సినిమాలు తీయడానికి తరచూ కష్టపడుతున్నానని, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసారని బన్నీ ఫ్యాన్స్ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్దీ రోజుల పాటు ఈ వార్ కొనసాగింది. ఆ తర్వాత చల్లారింది. ఇటీవల మరోసారి అల్లు అర్జున్ ఓ సినిమా ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారితీసాయి. దీనిపై కూడా అభిమానులు, జనసేన నేతలు స్పందించడం..బన్నీ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటె మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవికుమార్..గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ‘పుష్ప 2’ గురించి కాదని, పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని , అసలు మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటేనని అన్నారు. ఇదే సందర్బంగా ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చి అభిమానులను సంతోష పెట్టారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసి జనవరి 2025 కల్లా షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు SEP 2న స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని తెలిపి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.

Read Also : PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన

  Last Updated: 30 Aug 2024, 04:59 PM IST