Balakrishna : బాలకృష్ణ మద్యం బాటిల్ వీడియో‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

బాలకృష్ణ మద్యం బాటిల్ వీడియో‌, స్టేజి పై హీరోయిన్ అంజలిని తోసిన విషయం పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ.

Published By: HashtagU Telugu Desk
Producer Naga Vamsi Vishwak Sen Gave Clarity On Balakrishna Anjali Issue

Producer Naga Vamsi Vishwak Sen Gave Clarity On Balakrishna Anjali Issue

Balakrishna : నందమూరి బాలకృష్ణ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ లో ఏమి చేసినా,, అది బాగా వైరల్ అవుతుంటుంది. రీసెంట్ గా ఈ సీనియర్ హీరో.. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ఒక వీడియోలో బాలకృష్ణ పక్కన ఒక మధ్య బాటిల్ కనిపించింది. దానిని కొన్ని మీడియా ఛానల్స్ చూపిస్తూ.. వైరల్ వార్తలను టెలికాస్ట్ చేసింది.

పబ్లిక్ మీటింగ్ లో బాలయ్య మధ్య తీసుకోని, ఆ మత్తులో స్టేజి పై హీరోయిన్ అంజలిని తోసేశారని చెప్పుకొస్తూ వార్తలు టెలికాస్ట్ చేసారు. దీంతో ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ విషయం పై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిర్మాత నాగవంశీ అండ్ హీరో విశ్వక్ సేన్‌ని ప్రశ్నించగా,, వారు బదులిచ్చారు. ఆ మద్యం బాటిల్ ని ఎవరో గ్రాఫిక్స్ చేసి కావాలని క్రియేట్ చేసి.. వివాదం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇక అంజలి విషయం గురించి మాట్లాడుతూ.. బాలయ్య చాలా సరదా మనిషి అని, అంతేకాదు ప్రతి ఒక్కరితో చాలా క్లోజ్ ఉంటారని చెప్పుకొచ్చారు. ఆ క్లోజ్‌నెస్ తోనే హీరోయిన్ అంజలిని పక్కకి తోసినట్లు పేర్కొన్నారు. మనతో క్లోజ్ గా ఉన్నవాళ్ళతో కూడా మనం అలాగే ప్రవర్తిస్తామని, దీనిని ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారో అర్థంకాలేదని వ్యాఖ్యానించారు. కొంతమంది బాలయ్య మీద కావాలని నెగటివిటీ వ్యాప్తి చేయాలని చూస్తున్నారని, దానికి సోషల్ మీడియా హైప్ ఇస్తుందని చెప్పుకొచ్చారు.

  Last Updated: 30 May 2024, 06:37 PM IST