Site icon HashtagU Telugu

Producer : కేపీ చౌదరి ఆత్మహత్య

Producer Kp Choudhary Commi

Producer Kp Choudhary Commi

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈయన సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే తెలుగు, తమిళం సినిమాలకు డిస్ట్రిబ్యూటర్​గా కూడా పని చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్​గా వ్యవహరించారు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్​పై ఉన్నారు. ఈ క్రమంలోనే గోవా లో ఈయన ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version