Site icon HashtagU Telugu

Jani Master Case : సినీ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

C Kalyan Janimaster

C Kalyan Janimaster

Producer C Kalyan Reaction on Jani Master Issue : టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood ) లో జానీ మాస్టర్ (Jani Master) ఫై లైంగిక కేసు నమోదు కావడం పై పెద్ద దుమారం రేపుతుంది. తనను గంత కొంతలంగా లైంగికంగా జానీ వేధిస్తున్నాడని..అతడి భార్య సైతం అతడికి సపోర్ట్ చేసిందని..మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేయడం తో దీనిపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. కొంతమంది ఈ కేసు విషయంలో పాజిటివ్ గా స్పందిస్తుంటే..మరికొంతమంది మాత్రం శిక్ష పడాలని అంటున్నారు. కేసులో నిజానిజాలు తెలిసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు.

తాజాగా సినీ నిర్మాత సి కళ్యాణ్ (C Kalyan ) దీనిపై రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అన్నారు. ‘దీనిపై ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాల్సింది. ఇక్కడ అన్యాయం జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్లాల్సింది. కోర్టు తీర్పు రాకముందే యూట్యూబ్లో ఏవేవో రాసేస్తున్నారు. ఈ కేసుకు పోక్సో కేసు ఎలా వర్తిస్తుంది? దీనిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. లవ్ జిహాదీ అంటున్నారు. మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు’ అని చెప్పుకొచ్చారు.

మరోపక్క జానీ భార్య సైతం ..ఈ ఆరోపణలను ఖండించింది. జానీ మాస్టర్ అలాంటి వారు కాదని దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడే వ్యక్తి అన్నారు. జానీ కి నేషనల్ అవార్డు రావడం, రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండడం జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ఆరోపణలు చేసి ఆయనను కిందకు లగే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొంది. అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యం ఏంటి..? అంతకు ముందు ఆ అమ్మాయి షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి. మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ ..? మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నది. ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అని సవాల్ చేసింది. అన్యాయం జరిగిందన్న దానివి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవు అని జానీ భార్య ప్రశ్నించింది. ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి. బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు గదా అని తెలిపింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. విచారణ పూర్తి కాగానే ఆయన్ను కోర్ట్ లో హాజరుపరిచే అవకాశం ఉంది.

Read Also :  Tirumala Laddu Controversy : హైకోర్టుకు వైసీపీ