తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుపొందిన బన్నీ వాసు (Bunny vaasu) ..కీలక సూచనను తెలియజేసారు. బాగా చదువుకుని, బాగా సంపాదిస్తే, ఇంట్లోనే హ్యాపీగా ఉండండి.. అంతేతప్ప రాజకీయాల్లోకి రాకండి అంటూ సూచించారు. ప్రస్తుతం ఈయన ‘కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్’ (Kotabommali Police Station) ను నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘నయట్టు’ కి రీమేక్ గా తెలుగులో రూపొందింది. ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ సినిమాల డైరెక్టర్ తేజ మార్ని ఈ సినిమాను తెరకెక్కించగా.. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా ఈ మూవీ ప్రొమోషన్ పాల్గొన్న వాసు..ప్రస్తుత రాజకీయాల (Politics) గురించి తన మనసులోని మాటలను తెలిపారు. “కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్.. సినిమాను అనుభవం ఉన్నపొలిటీషియన్ గానే చూశాను. భవిష్యత్ ఇలా ఉండబోతుందని నేను అనుకోను. కానీ జరుగుతున్నది ఇలాగే ఉంది. బాగా చదువుకుని, బాగా సంపాదిస్తే, ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. అంతేతప్ప రాజకీయాల్లోకి రాకండి. ఈ రోజు ఉన్న రాజకీయాల్లోకి ఒక వ్యక్తి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేయాలి. నన్ను ఎవడు తిట్టినా ఫర్వాలేదు. నా ఫ్యామిలీ ఫోటోలు ఎవడు సోషల్ మీడియాలో పెట్టిన ఫర్వాలేదు. నా ఫ్యామిలీని, కూతురును, భార్యను ఎవరు ఏమన్నా ఫర్వాలేదు. నాకేం పట్టదు అని బట్టలు విప్పి రోడ్డు మీద నడవగలిగిన వాడే ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్లగలడు. చదువుకున్న వారు, ఆత్మాభిమానం ఉన్నవారు, చిన్న మాట అంటే పడని వారు మాత్రం రాజకీయాలకు సూట్ కారు. ఒకవేళ నేను పోటీ చేయాలి అనుకుంటే నేనూ అన్నింటిని వదిలేయాల్సిందే. లేదంటే ఇంట్లో కూర్చొవడం బెస్ట్” అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Pune Shocker: పుట్టినరోజు కోసం దుబాయ్‌కు తీసుకెళ్లనందుకు దారుణం