Site icon HashtagU Telugu

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప గొడవ గురించి నన్ను అడగవద్దు.. నిర్మాత కామెంట్స్ వైరల్..

Case Against Allu Arjun

Case Against Allu Arjun

Pushpa 2 : ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 దర్శకహీరోలు సుకుమార్, అల్లు అర్జున్‌ల గొడవ వార్త హాట్ టాపిక్ గా మారింది. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే సుకుమార్, అల్లు అర్జున్ మధ్య.. పుష్ప 2 షూటింగ్ విషయంలో విబేధాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఫిక్స్ చేసిన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని దర్శకుడు టీం చివరి క్షణంలో క్యాన్సిల్ చేస్తున్నారని అల్లు అర్జున్ కోపం తెచ్చుకున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఈ కోపంతోనే షూటింగ్ ని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.

అంతేకాదు, పుష్ప గెటప్ కోసం పెంచిన గెడ్డంని కూడా అల్లు అర్జున్ ట్రిమ్ చేసేశారని కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి అల్లు అర్జున్ స్నేహితుడు మరియు చిత్ర నిర్మాత అయిన ధీరజ్ ని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ గీతాఆర్ట్స్ బ్యానర్ లో ధీరజ్ కూడా ఒక కుటుంబసభ్యుడు, మరియు బన్నీకి మంచి స్నేహితుడు కూడా. దీనివల్ల అల్లు అర్జున్ విషయాలన్నీ ఆయనికి బాగా తెలిసి ఉంటాయి. ఆ ఆలోచనతోనే ఓ విలేకరి రీసెంట్ ప్రెస్ మీట్ లో ధీరజ్ ని ఈ విషయం గురించి ప్రశ్నించారు.

దానికి ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. తనకి ఆ ప్రశ్నకి ఏ సంబంధం లేదని, నేను అసలు దాని గురించి మాట్లాడానని, ఇంకేమైనా అడగండి.. అంటూ మాట దాటేసారు. కాగా ఈ గొడవ వార్తలు పై అల్లు అర్జున్ టీం రెస్పాండ్ అవుతూ.. సుకుమార్, బన్నీ మంచి స్నేహితులని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తమని చెప్పుకొచ్చారు. అంతేకాదు పుష్ప 2ని డిసెంబర్ లో రిలీజ్ చేయడం పక్కా అంటూ పేర్కొన్నారు.