భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో భారత సైన్యం చూపిస్తున్న శౌర్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాద శక్తులను మట్టుబెడుతున్న మన సైన్యం పటిమకు ప్రతి పౌరుడు సంఘీభావం ప్రకటిస్తున్నాడు. ఈ సందర్భంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నిర్మాణ సంస్థ నుంచి విడుదలైన సింగిల్ (Single ) చిత్రం తొలి రోజు వసూళ్లలోని (Single Collections) ఒక భాగాన్ని భారత సైన్యం కోసం విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.
Emergency Alerts: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ప్రతి ఒక్కరూ మీ మొబైల్‌లో ఇలా చేయండి!
అల్లు అరవింద్ మాట్లాడుతూ – “మన దేశ సైనికులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. వారి సంక్షేమం కోసం చేయగలిగిన సహాయం ప్రతి పౌరుడి బాధ్యత” అని పేర్కొన్నారు. తన సంస్థ నిర్మాతగా ఉన్న సింగిల్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల నుంచి కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించబోతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటన అందరిని కదిలించింది. ఓ నిర్మాతగా బాధ్యతను పంచుకోవడం గొప్ప విషయమని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది అల్లు అరవింద్ తీసుకున్న ఓ ఉదాత్తమైన నిర్ణయంగా మాత్రమే కాకుండా, ఇతరులకూ ప్రేరణనిచ్చే చర్యగా మారింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భారత సైన్యానికి మద్దతు ప్రకటించినా, ఇలా స్పష్టంగా వసూళ్ల నుండి విరాళంగా ప్రకటించడం అరుదైనది. ఈ నిర్ణయం మరిన్ని సినీ ప్రముఖులను, సాధారణ ప్రజలను సైన్యం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసేలా చేస్తోంది. దేశమంతా ఒక్కటై ఉగ్రవాదాన్ని ఎదిరిస్తున్న సమయంలో అల్లు అరవింద్ లాంటి వ్యక్తుల చర్యలు సైన్యానికి మానసిక బలాన్ని అందిస్తాయి.