చిత్రసీమలో కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లకు షాప్ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ ఆఫర్లు ఎక్కువగా వస్తుంటాయనే సంగతి తెలిసిందే. టాప్ హీరోయిన్ చేత తమ షాప్ ఓపెనింగ్ చేయిస్తే..జనాల్లోకి ఎక్కువగా వెళ్తుందని ఆయా షాప్ ఓనర్లు భావిస్తుంటారు. ఇందుకు గాను ఆ హీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి రప్పిస్తారు. కొన్ని కొన్ని సార్లు అనుకోని సంఘటనలు జరుగుతాయి. తాజాగా ఈరోజు అలాంటిదే జరిగింది. షాప్ ఓపెనింగ్ లో అపశృతి జరిగింది. ఈ ఘటన లో నటి ప్రియాంక మోహన్ (Priyanka Mohan) క్షేమంగా బయటపడింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Torrur) పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ (Kasam Shopping Mall) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హీరోయిన్ ప్రియాంక మోహన్, ఎమ్మెల్యే యశస్విని అత్త, పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి గాయపడ్డారు. ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. అయితే, ప్రియాంక మోహన్ తృటిలో తప్పించుకున్నారని, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనతో కాసేపు గందరగోళం ఏర్పడింది.
ప్రియాంక మోహన్ సినీ కెరియర్ విషయానికి వస్తే..నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ లోను అటు కోలీవుడ్ లోను గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీ తో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన OG మూవీ లో నటిస్తుంది.
Read Also : Heart Attack Signals : చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు, ఇది గుండెపోటుకు సిగ్నల్ కావచ్చు..!