Site icon HashtagU Telugu

Tillu Cube : ‘టిల్లు క్యూబ్’లో హీరోయిన్‌గా ఆ తెలుగు భామ.. నిజమేనా..?

Priyanka Jawalkar Is Actress For Siddhu Jonnalagadda Tillu Cube Movie

Priyanka Jawalkar Is Actress For Siddhu Jonnalagadda Tillu Cube Movie

Tillu Cube : టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్. 2022లో ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా రిలీజైన డీజే టిల్లు.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు టిల్లు పాత్రకి యూత్ లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఆ పాత్రతో మరికొన్ని సినిమాలు తీసుకురావాలని ఫిక్స్ అయిన మేకర్స్.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో వచ్చారు.

ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి సిద్ధుకి మొదటి వంద కోట్ల చిత్రం అయ్యింది. రెండో పార్ట్ మొదటి భాగాన్ని మించి హిట్ అవ్వడంతో.. మూడో పార్ట్ పై ఆడియన్స్ లో మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం ఎప్పుడు వస్తుంది..? ఈసారి టిల్లు గాడిని సతాయించే రాధిక పాత్రని ఎవరు పోషించబోతున్నారు..? అలాగే ఈ మూడో భాగాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు..? అనే విషయాలు పై క్యూరియాసిటీ నెలకుంది.

ఈ ప్రశ్నలకు ఫిలిం వర్గాల్లో కొన్ని సమాధానాలు వస్తున్నాయి. ఇక ఆన్సర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మూడో భాగంలో రాధికగా తెలుగు అమ్మాయి కనిపించబోతుందట. టాక్సీవాలా, ఎస్ ఆర్ కల్యాణమండపం వంటి హిట్ సినిమాల్లో నటించిన ప్రియాంక జవల్కార్.. టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా కనిపించబోతున్నారట. కాగా టిల్లు స్క్వేర్ లో ఈ భామ గెస్ట్ అపిరెన్స్ లో కనిపించి ఆడియన్స్ ని అలరించింది. మూడు పార్ట్ కి లింక్ చేయడం కోసమే ప్రియాంక పాత్రని సెకండ్ పార్ట్ లో గెస్ట్ అపిరెన్స్ తో చూపించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ మూడో భాగాన్ని డైరెక్ట్ చేసే దర్శకుడు విషయానికి వస్తే.. ‘మ్యాడ్’ సినిమాని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.