Site icon HashtagU Telugu

Priyanka Jain : బిగ్‌‌బాస్ నుంచి బయటకి రాగానే పెళ్లి వార్త చెప్పిన ఆ కంటెస్టెంట్..

Priyanka Jain Revealed about Her Marriage with Siva Kumar

Priyanka Jain Revealed about Her Marriage with Siva Kumar

ఇటీవల బిగ్‌‌బాస్(Bigg Boss) సీజన్ 7 లో సీరియల్ నటి ప్రియాంక జైన్(Priyanka Jain) వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి చివరి వరకు గట్టిగా ఆడి టాప్ 5 గా నిలిచింది. పలు టీవీ సీరియల్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ కన్నడ భామ ప్రియాంక జైన్ బిగ్‌‌బాస్ తో బాగా పాపులర్ అయింది.

అయితే ప్రియాంక జైన్.. శివ కుమార్(Siva Kumar) అనే మరో నటుడిని ప్రేమించినట్టు, నిశ్చితార్థం కూడా జరిగినట్టు బిగ్‌‌బాస్ లో వెల్లడించింది. శివ కుమార్ కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో బిగ్‌‌బాస్ కి వచ్చాడు. అప్పుడు ప్రియాంక జైన్ బాగా ఎమోషనల్ అయింది. పెళ్ళెప్పుడు చేసుకుందాం అని బిగ్‌‌బాస్ లోనే అడిగింది.

ఇక ఇటీవల హౌస్ నుంచి బయటకి రాగానే మొదట తన పెళ్లి గురించే చెప్పింది. ప్రియాంక జైన్ తన యూటుబ్ ఛానల్ లో తాజాగా శివ కుమార్ తో జరిగిన నిశ్చితార్థం వీడియోని షేర్ చేసి.. ఆ వీడియోలోనే 2025లో పెళ్లి చేసుకుంటాం. త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది. హౌస్ లో టాస్క్ లో భాగంగా జుట్టు కత్తిరించుకున్నాను. అది పెరగగానే చేసుకుంటాను. పెళ్లి డేట్ కూడా నేనే ప్రకటిస్తాను అని తెలిపింది. దీంతో ప్రియాంక జైన్ అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మొత్తానికి బిగ్‌‌బాస్ కి వెళ్లొచ్చి ప్రియాంక త్వరలోనే అత్తారింట్లో అడుగుపెట్టనుంది.

Also Read : Kalyan Ram : రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికీ అనేదానిపై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..