గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మంగళవారం చిలుకూరు బాలాజీ స్వామి (Chilkur Balaji Temple)ని దర్శించుకుంది. ప్రస్తుతం ఈమె సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) హీరోగా రాజమౌళి(Rajamouli) కలయికలో తెరకెక్కనున్న మూవీ లో హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు చర్చల కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారంటూ నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. మరి నిజంగా ఆ సినిమా కోసమే వచ్చారా ..? లేదా అనేది క్లారిటీ గా తెలియనప్పటికీ.. తాజాగా హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక్షమై భక్తులను, అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Personality Test : మీకు ఇష్టమైన పండు మీ రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది
హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తప్పకుండ బాలాజీ తీరుస్తాడని నమ్మకం. అందుకే సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ , బిజినెస్ ప్రముఖులు కూడా బాలాజీ ని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఈరోజు ప్రియాంకా చోప్రా వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించింది. ప్రదక్షణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకుంది. ప్రియాంకా చోప్రాకు పూజారులు శేష వస్త్రంతో గౌరవించారు. ఈ టెంపుల్ విజిట్‌కు సంబంధించిన ఫొటోలను ప్రియంకా చోప్రా తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసింది.
ఆలయ ఆవరణలో తను ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన ప్రియాంకా చోప్రా..‘‘శ్రీ బాలాజీ ఆశీస్సులతో కొత్త అధ్యాయం మొదలైంది. మనమందరం మన హృదయాల్లో శాంతిని నింపుకొని, మన చుట్టూ సమృద్ధి, సౌభాగ్యాలతో గడపాలి. దేవుడి దయ అనంతం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్యూ ఉపాసన కొణిదెల” అని తన పోస్ట్‌లో పేర్కొంది. ప్రియాంకా చోప్రా పోస్ట్‌కు మెగా కోడలు ఉపాసన కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘మీ నూతన సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని కామెంట్ చేశారు.