Priyanka Chopra: రాత్రి సమయంలో ఒక అబ్బాయి మా బాల్కనీలో దూకాడు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటించిన ప్రియాంక చోప్రా ప్రస

Published By: HashtagU Telugu Desk
Priyanka Chopra

Priyanka Chopra

బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటేతాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన బాల్యం గురించి బాల్యంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

12 ఏళ్ళ వయసులోనే చదువు కోసం నాన్న అమెరికా పంపించారు. అక్కడి సంప్రదాయాలు, ఆహారం, అలవాటు అయ్యాయి. ఆ సమయంలో నాకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. నా ఆహార్యం పూర్తిగా మారిపోయింది. చదువు పూర్తి చేసుకుని నాలుగేళ్ల తరువాత ఇండియాకు తిరిగి వచ్చేసాను. తరువాత మేము ఉంటున్న పట్టణం లోని ఒక స్కూల్‌లో చేర్పించారు. స్కూల్‌ నుంచి తిరిగి వచ్చే సమయంలో కొంతమంది అబ్బాయిలు నా వెంట పడుతూ అలా మా ఇంటి వరకు వచ్చేవారు. అలా ఒక రోజు రాత్రి ఒక అబ్బాయి మా బాల్కనీ లోకి దూకాడు. దీంతో నేను అరుస్తూ నాన్న దగ్గరకి పరిగెత్తాను.

దాంతో ఆయన నా గది కిటికీనీ మూయించారు. అంతేకాకుండా నాకు కొన్ని షరతులు విధించారు. అమెరికాలో ఉన్నట్లు ఇక్కడ ఉంటే కుదరదు అని తెలిపారు. ఇకపై జీన్స్‌లను వేసుకోకూడదు అంటూ నన్ను క్రమశిక్షణతో వ్యవహరించాలని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్లినా తోడుగా ఒక వ్యక్తిని పంపించేవారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. కానీ, నాన్న ఎందుకు అలా చేశారో ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. ఆయనను కోల్పోవటం దురదృష్టకరం అని బాల్యంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకోవడంతో పాటు తన తండ్రిని కోల్పోయినందుకు కూడా బాధపడింది ప్రియాంక. ఇది ఇలా ఉంటే ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇప్పటికీ రెండు ఎపిసోడ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

  Last Updated: 03 May 2023, 08:41 PM IST