Priyanka: ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందా.. ప్రెగ్నెన్సీ పై ఎలా రియాక్ట్ అయ్యిందంటే!

ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారా? గత రెండు రోజులుగా వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. మరుసటి రోజు, వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఊహాగానాలు వ్యాపించాయి.

  • Written By:
  • Publish Date - November 24, 2021 / 03:23 PM IST

ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారా? గత రెండు రోజులుగా వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. మరుసటి రోజు, వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఊహాగానాలు వ్యాపించాయి. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ బయో నుండి జోనాస్‌ను తొలగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు, విడాకుల పుకార్ల తర్వాత, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ప్రెగ్నెన్సీ రూమర్స్ కోసం వార్తల్లో నిలిచారు.

ప్రియాంక చోప్రా జోనాస్ ఫ్యామిలీ షో ది జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ లో పాల్గొంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంలో పిల్లలు లేని జంట తాను, నిక్ మాత్రమేనని, అయితే త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నామని, అందుకోసం తాను ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పింది. అయితే నిక్ తెల్లముఖమేసి నిలబడగా, ప్రియాంక నవ్వుతూ.. జస్ట్ జోక్ మాత్రమేనని అని పేర్కొంది. ఈ షోలో ప్రియాంక, నిక్ మధ్య ఉన్న వయస్సు కూడా ప్రస్తావనకు వచ్చింది.

2018లో పెళ్లి చేసుకునే సమయంలో తాము ట్రోల్స్ కు గురయ్యామని చెప్పింది. నిక్, నాకు 10 ఏండ్ల గ్యాప్ ఉందని స్పష్టం చేసింది. నటనపరంగా, కల్చర్ పరంగా చాలా తేడాలున్నప్పటికీ ఇద్దరం ఒకొరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని నవ్వుతూ చెప్పింది. అయితే ప్రియాంక తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బయోస్ నుంచి తన ఇంటి పేర్లు ‘చోప్రా జోనాస్’ని కూడా తొలగించింది. దీంతో ఇద్దరి మధ్య విభేధాలున్నట్టు పుకార్లు వ్యాపించిన సంగతి అందరికీ తెలిసిందే.