Priyanka Chopra : బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సినిమాలను పట్టించుకోవడం మానేసింది ప్రియాంక చోప్రా. ఐతే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీలో అమ్మడు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మహేష్, ప్రియాంక లీడ్ రోల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతుంది.
ఇప్పటికే సినిమా కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పగా కెన్యా అడవుల్లో సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా పాత్ర గురించి లీక్ వచ్చింది. సినిమాలో ప్రియాంక చోప్రా రోల్ నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది.
మహేష్ బాబు సినిమాలో పీసీ ఫిమేల్ లీడ్ అనుకోగా ఆమె పాత్ర కాస్త నెగిటివ్ టచ్ తో ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అనగానే ప్రియాంక చోప్రా కూడా చాలా ఎగ్జైట్ అయినట్టు తెలుస్తుంది. సో మహేష్ సినిమాలో పీసీ రోల్ ఎలా ఉంటుందో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెది నెగిటివ్ రోల్ అన్న ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తర్వాత తెలుస్తుంది.
ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడం వల్ల అటు హాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ సినిమాలు సీరీస్ లు చేస్తున్న ప్రియాంక మహేష్ 29వ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని చెప్పొచ్చు.