గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రమాదానికి (Injured ) గురైంది. బాలీవుడ్ మోస్ట్ హాట్ బ్యూటీ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న టైం లో హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకొని బాలీవుడ్ కు దూరమైంది. ఇదే క్రమంలో హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ గా మారింది. ప్రస్తుతం ఈమె ‘ది బ్లఫ్’ మూవీ చేస్తుంది. బాయ్స్ ఫేమ్ ‘కార్ల్ అర్బన్’ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్రాంక్ E. ఫ్లవర్స్’ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో ప్రియాంక ప్రమాదానికి గురైంది.
We’re now on WhatsApp. Click to Join.
దీనికి సంబంధించిన ఫొటోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయినట్లు సెల్ఫీ ఫొటోను షేర్ చేసింది. స్టంట్ చేస్తుండగా ఇలా జరగినట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్గా మారింది. దీంతో అభిమానులు ఆమెకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే షూటింగ్లలో గాయపడటం ఆమెకు కొత్తేమి కాదు. గతంలో పలు సినిమాల షూటింగ్ లలో ఇలాగే ప్రమాదాలకు గురవడం జరిగింది. రస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రియాంక మాజీ పైరేట్గా నటిస్తోంది. ఈ చిత్రం అమెజాన్ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Read Also : Bandi Sanjay : ఇంద్ర సినిమా లెవల్లో ఎంట్రీ ఇచ్చిన బండి సంజయ్