Site icon HashtagU Telugu

Priyanka Chopra: వైరల్ ఫోటో.. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీతో సందడి

Priyanka Chopra

Resizeimagesize (1280 X 720) (7) 11zon

జోనాస్ బ్రదర్స్ కోసం హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌లో తన కుమార్తె మాల్తీ మేరీ ముఖాన్ని ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తొలిసారి ప్రపంచానికి చూపించింది. అయితే, ఆ తర్వాత ప్రియాంక, నిక్ తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో మాల్తీ ముఖాన్ని పంచుకోలేదు. తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తన కూతురి మరో ఫోటోని పంచుకుంది. ఆదివారం ప్రియాంక తన బిడ్డతో ఉన్న రెండు చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఒక ఫొటోలో ఆమె మాల్తీ ముఖాన్ని చూపుతూ సెల్ఫీని క్లిక్ చేసింది.మరో ఫొటోలో తన బిడ్డ మొఖాన్ని కవర్ చేస్తూ ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించిన విరాట్ కోహ్లీ

ఇలాంటి రోజులు అంటూ తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ప్రియాంక, నిక్ 2018 డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయాలను వివాహం చేసుకున్నారు. గత ఏడాది సరోగసీ ద్వారా తమ కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు.
వర్క్ ఫ్రంట్‌లో ప్రియాంక ‘లవ్ ఎగైన్’, ‘సిటాడెల్’ సిరీస్‌లో కనిపిస్తుంది. ఆమె అలియా భట్, కత్రినా కైఫ్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ ‘జీ లే జరా’లో కూడా కనిపించనుంది.