Site icon HashtagU Telugu

Priyamani : బాలీవుడ్ భామల గుట్టు విప్పిన అమ్మడు.. డబ్బులిచ్చి మరీ అలా చేయించుకుంటారట..!

Priyamani

Priyamani

Priyamani ముందు తమిళంలో సత్తా చాటి అక్కడ నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న ప్రియమణి తెలుగులో కూడా మొదట్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే కేవలం హీరోయిన్ గానే ఉండిపోకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ సత్తా చాటుతుంది ప్రియమణి. తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లో ప్రియమణి సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన నెరు, భామాకలాపం 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ప్రస్తుతం తన కెరీర్ చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పుకొచ్చింది ప్రియమణి. అంతేకాదు బాలీవుడ్ భామల ఫోటో షూట్స్ వెనకాల ఉన్న గుట్టు కూడా విప్పింది ప్రియమణి. బాలీవుడ్ భామలు ఎయిర్ పోర్ట్, జిం ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోస్ తీస్తుంటారు. అయితే అది ఆ హీరోయిన్స్ ఒక ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నారని చెప్పుకొచ్చింది ప్రియమణి.

బాలీవుడ్ లో పపరాజీ కల్చర్ గురించి చెప్పింది ప్రియమణి జవాన్ ప్రమోషన్స్ టైం లో ఒక ఏజెన్సీ తనకు కాల్ చేసి పపరాజీ గురించి చెప్పారని దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఒక చార్ట్ పంపించారని చెప్పుకొచ్చింది ప్రియమణి. హీరోయిన్స్ జిం, ఎయిర్ పోర్ట్ ఇలా ఎక్కడ కనిపించినా ఆ ఏజెన్సీ మనుషులు అక్కడికి వెళ్లి వారి ఫోటోస్ ని క్లిక్ అనిపించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా పపరాజీ కల్చర్ బాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయ్యింది.

Also Read : Kannappa : కన్నప్పలో పార్వతిదేవి ఎవరు.. ఆ ఇద్దరిలో ముందు ఆమె అన్నారు కానీ ఇప్పుడు మాత్రం..!