హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Priyamani  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ప్రియమణి… పలు వెబ్ సిరీస్‌ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇండో-అమెరికన్ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయింది. బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ఆమె ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతోంది. హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని సోషల్ […]

Published By: HashtagU Telugu Desk
Priyamani

Priyamani

Priyamani  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ప్రియమణి… పలు వెబ్ సిరీస్‌ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇండో-అమెరికన్ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయింది. బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ఆమె ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతోంది.

హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.

భారతీయ, అమెరికా సంస్కృతుల కలయికతో, ఒక వలస కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగపూరిత ప్రయాణమే ఈ సినిమా కథాంశం. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది.

  Last Updated: 18 Feb 2026, 12:00 PM IST