Sarvam Shakthi Mayam : ఆహా ఓటీటీలో దసరా స్పెషల్ వెబ్ సిరీస్.. ప్రియమణి మెయిన్ లీడ్‌లో..

తెలుగు ఓటీటీ ఆహా(Aha OTT) ఇప్పుడు దసరా(Dasara) కానుకగా మరో కొత్త డివోషనల్ సిరీస్ తో రాబోతుంది.

Published By: HashtagU Telugu Desk
Priyamani Devotional Web Series Sarvam Shakthi Mayam Streaming soon in Aha OTT

Priyamani Devotional Web Series Sarvam Shakthi Mayam Streaming soon in Aha OTT

ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో మన ముందుకు వస్తుంది తెలుగు ఓటీటీ ఆహా(Aha OTT). ఇప్పుడు దసరా(Dasara) కానుకగా మరో కొత్త డివోషనల్ సిరీస్ తో రాబోతుంది. ప్రియమణి(Priyamani), సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’(Sarvam Shakthi Mayam) అనే వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ఈ సిరీస్ ని ప్రదీప్ మద్దాలి తెరకెక్కించాడు. బివిఎస్.రవి కథ అందించగా అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు.

ఆహాలో ఈ సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ దసరా కానుకగా అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కథ సాగుతుంది.

ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయి. ఈ సిరీస్ ద్వారా మొత్తం భారతదేశంలోని 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని ఒక శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ దసరాకు ‘సర్వం శక్తి మయం’ అనే ఈ డివోషనల్ వెబ్ సిరీస్‌ తో ఆహా సందడి చేయనుంది.

Also Read : Aha : ఆహా టీమ్ ఫై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

  Last Updated: 09 Oct 2023, 08:10 PM IST