Bro Daddy : చిరంజీవి కొడుకుగా శర్వానంద్..?

మలయాళంలో సూపర్​ హిట్​ అయిన బ్రో డాడీ (Bro Daddy) చిత్ర రీమేక్ లో మెగాస్టార్

Published By: HashtagU Telugu Desk
Bro daddy remake

Bro daddy remake

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) జోరు మాములుగా లేదు.సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గరి నుండి యువ హీరోలతో పోటీపడి నటిస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో కథను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల తమ్ముడు పవన్ కళ్యాణ్ మాదిరి వరుస రీమేక్ కథలనే నమ్ముకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ , భోళా శంకర్ చిత్రాలు తెరకెక్కగా..ఇప్పుడు మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

మలయాళంలో సూపర్​ హిట్​ అయిన బ్రో డాడీ (Bro Daddy) చిత్ర రీమేక్ లో మెగాస్టార్ నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మిస్తుండడం విశేషం. అలాగే ఈ మూవీ లో చిరంజీవి కి జోడీగా త్రిష నటించనున్నారు. గతంలో త్రిష..స్టాలిన్ మూవీ లో చిరు కు జోడిగా నటించింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మెగా హిట్ అయ్యింది. సుమారు 23 ఏళ్ల తర్వాత మరోసారి చిరంజీవితో త్రిష (Trisha ) జత కట్టబోతుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కుమారుడి పాత్ర కోసం శర్వానంద్‌‌ (Sharwanand )ను ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తుంది. గతంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా మూవీ లో శర్వా ప్రత్యేక పాత్ర చేసాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ లో శర్వా ..చిరు కు కొడుకుగా నటిస్తున్నాడని కొంతమంది అంటే..లేదు చిరంజీవి కి తమ్ముడిగా నటిస్తున్నాడని మరికొంతమంది అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక భోళా శంకర్ విషయానికి వస్తే..మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం వేదాళం మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ , సుశాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా నిర్మితమైంది.

Read Also : Vaishnavi Chaitanya : ఇస్మార్ట్ కు జోడిగా బేబీ.. ఇక.‘డబుల్ ఇస్మార్టే’

  Last Updated: 04 Aug 2023, 01:49 PM IST