Site icon HashtagU Telugu

Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ పాన్-వరల్డ్ మూవీ అప్‌డేట్‌ల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆ ఎదురుచూపులకు తెరదించుతూ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఫస్ట్ లుక్‌ను రాజమౌళి తాజాగా విడుదల చేశారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ‘కుంభ’ అనే క్రూరమైన, శక్తిమంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్‌చైర్‌లో కూర్చుని, ఆయన వెనుక రోబోటిక్ చేతులు కలిగి ఉండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఆయన చూపుల్లోని తీవ్రత ఈ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది.

Also Read: TG Govt : డైలమాలో రేవంత్ సర్కార్..అసలు ఏంజరిగిందంటే !!

రాజమౌళి ప్రశంసలు.. ‘అత్యుత్తమ నటులలో ఒకరు’

పృథ్వీరాజ్ సుకుమారన్ నటనను రాజమౌళి ఆకాశానికెత్తారు. లుక్‌ను విడుదల చేస్తూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఇలా రాసుకొచ్చారు. పృథ్వీతో మొదటి షాట్‌ చిత్రీకరించిన తర్వాత నేను అతడి దగ్గరకు వెళ్లి ఒక మాట చెప్పాను. నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరని చెప్పా. ఈ దుష్ట, క్రూరమైన, శక్తిమంతమైన విలన్ కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ పాత్రలో సంపూర్ణంగా ఒదిగిపోయిన పృథ్వీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

మహేశ్‌బాబు స్పందన

కుంభ లుక్‌పై స్పందిస్తూ హీరో మహేశ్‌బాబు ఇచ్చిన క్యాప్షన్ సైతం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “నేను అవతలి వైపు ఉన్నాను. ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైంది!” అని మహేశ్‌బాబు పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లు ఈ వారం కొనసాగనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 15న ‘గ్లోబ్ ట్రోటర్’ (#GlobeTrotter) ఈవెంట్‌లో సినిమా టైటిల్, మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ రివీల్ కానున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Exit mobile version