Prithviraj Sukumaran: ఇతర ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్?

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 05:53 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పృథ్వీరాజ్ తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. కాగా పృథ్వీరాజ్ ఇటీవల విడుదలైన సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఈ సినిమాలో వరదరాజ మన్నార్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించారు. కాగా పృథ్వీరాజ్ తాజాగా నటించిన చిత్రం ఆడు జీవితం : ది గోట్ లైఫ్. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ మార్చ్ 28 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం పృథ్విరాజ్ సుకుమారన్ దాదాపు ఆరేళ్ళు కష్టపడ్డాడు. ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోతే ఎలా బయటకు వచ్చాడు అనే కథాంశంతో సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం పృథ్విరాజ్ సుకుమారన్ దాదాపు 31 కిలోలు బరువు తగ్గి, కొన్ని సినిమాలని వదిలేసుకొని కష్టపడ్డాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

పృథ్విరాజ్ సుకుమారన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మలయాళ సినిమాల గురించి, రెమ్యునరేషన్స్ గురించి, వేరే పరిశ్రమల రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడారు. యాంకర్ పృథ్వీరాజ్ని ప్రశ్నిస్తూ. మలయాళంలో మీరు తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు చేసి మంచి హిట్ కొడతారు. అదెలా సాధ్యం అని అడిగారు. దానికి పృథ్విరాజ్ సుకుమారన్ సమాధానమిస్తూ.. వేరే సినీ పరిశ్రమలలో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక సినిమాకి 75 కోట్లు పెడితే అందులో 55 కోట్లు రెమ్యునరేషన్స్ కే పెడతారు. మేకింగ్ కి కేవలం 20 కోట్లు మాత్రమే పెడతారు. కానీ మా దగ్గర సినిమా మేకింగ్ కి ఎక్కువ ఖర్చు చేస్తారు. మా రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉండవు. నేను చాలా సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోను. సినిమా మీదే ఖర్చు పెట్టమంటాను. సినిమా హిట్ అయితే ప్రాఫిట్స్ లోంచి షేర్ తీసుకుంటాను. అందుకే మా సినిమాలు బాగుంటాయి. అలా అని మా సినిమాలే బాగుంటాయి అని నేను చెప్పను. ఇటీవల మలయాళం సినిమాలకు మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఇదే అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.