Site icon HashtagU Telugu

Prithviraj Sukumaran : సలార్, కేజీఎఫ్‌కి కనెక్షన్ ఉందా..? ఆసక్తి రేపుతున్న పృథ్వీరాజ్ కామెంట్స్..

Prithviraj Sukumaran Said His Role In Salaar Had Connection With Another Cinematic Universe

Prithviraj Sukumaran Said His Role In Salaar Had Connection With Another Cinematic Universe

Prithviraj Sukumaran : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, ప్రథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ యూనివర్స్ తరువాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించారు. సలార్ రిలీజ్ కి ముందు.. కేజీఎఫ్ తో సలార్ కి కనెక్షన్ ఉంటుందని, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ రిలీజ్ తరువాత సలార్ అండ్ కేజీఎఫ్ కి ఎటువంటి కనెక్షన్ లేదని తెలిసిపోయింది.

అయితే తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కొన్ని కామెంట్స్.. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మళ్ళీ ఆలోచించేలా చేస్తుంది. రీసెంట్ గా సలార్ OST ని రిలీజ్ చేసారు. దానిలో పృథ్వీరాజ్ పోషించిన రాజ్ మన్నార్ పాత్రకి రవి బస్రూర్ ఇచ్చిన బీజీఎమ్ గురించి ఒక నెటిజెన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేశారు. దానికి పృథ్వీరాజ్ రియాక్ట్ అవుతూ.. “ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో శివ మన్నార్ కథ చాలా బాగుంది. ఇక్కడ మీరు ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే.. ఈ పాత్రతో మరో యూనివర్స్ కి కనెక్షన్ ఉంది” అంటూ ట్వీట్ చేసారు.

ఇక ట్వీట్ చూసిన నెటిజెన్స్ కి మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. మరో యూనివర్స్ అంటే కేజీఎఫ్..? లేక ఎన్టీఆర్ తో నీల్ చేయబోయే సినిమానా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మూవీ.. కేజీఎఫ్, సలార్ కథలకు పూర్తి బిన్నంగా ఉంటుందని, అసలు వాటికీ NTR30కి ఎలాంటి కనెక్షన్ ఉండదని ప్రశాంత్ నీల్ గతంలోనే చెప్పుకొచ్చారు. దీంతో పృథ్వీరాజ్ చెప్పిన కనెక్షన్.. ‘కేజీఎఫ్’నెమో అనే సందేహం బలపడుతుంది. మరి ప్రశాంత్ నీల్ అసలు ఏం ప్లాన్ చేసాడో తెలియియలంటే కొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.