Prithviraj Sukumaran : ఒక్క సినిమా కోసం 16 ఏళ్ళ ప్రయాణం.. ఎడారిలో కష్టాలు.. ది గోట్ లైఫ్ సినిమా కోసం పృథ్విరాజ్..

ఇప్పుడు పృథ్విరాజ్ 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' అనే సినిమాతో రాబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 04:16 PM IST

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) గత సంవత్సరం ప్రభాస్ ఫ్రెండ్ గా సలార్ సినిమాతో ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పృథ్విరాజ్ ‘ది గోట్ లైఫ్ – ఆడు జీవితం'(The Goat Life Aadu Jeevitham) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి ఎడారిలో తప్పిపోయి మూడేళ్లకు పైగా ఎడారిలో ఉన్న అతని జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వంలో ఈ ది గోట్ లైఫ్ – ఆడు జీవితం సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పృథ్విరాజ్ సుకుమారన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి పడ్డ కష్టాలు తెలిపాడు.

పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ఈ సినిమాని మొదటిసారి 2008 లో డైరెక్టర్ నాకు వినిపించాడు. అప్పట్నుంచి ఈ కథ మీద 16 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. 2018లో ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఫస్ట్ రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ అనుకున్నాము కానీ అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దీంతో జోర్డాన్ వెళ్లి షూటింగ్ చేసాం. షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కరోనా వచ్చి లాక్ డౌన్ వచ్చింది. దీంతో జోర్దాన్ లో చిక్కుకుపోయాము కొన్ని రోజులు. భారత ప్రభుత్వం చొరవతో వందేభారత్ ఫ్లైట్ లో కేరళ వచ్చాం. మళ్ళీ ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో షూటింగ్ చేసాం. ఇక ఈ క్యారెక్టర్ కోసం నేను చాలా స్ట్రిక్ట్ డైట్ చేసి 31 కిలోల బరువు తగ్గాను. కొన్ని రోజులు కేవలం బ్లాక్ కాఫీ, నీళ్లు మాత్రమే తాగేవాడిని. ఇన్ని కష్టాలని ఓర్చుకొని 16 ఏళ్లుగా సాగిన ఈ సినిమాని ఇప్పుడు ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

 

Also Read : Prashanthi Harathi : ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో సునీల్ వైఫ్ క్యారెక్టర్ గుర్తుందా? 20 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ..