Mann Ki Baat: తెలుగు నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసల వర్షం కురిపించారు. 2024 సంవత్సరం సెప్టెంబరు 20వ తేదీని తెలుగు సినీ పరిశ్రమకు చారిత్రక దినోత్సవంగా ఆయన అభివర్ణించారు. ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి జరిగిందని మోడీ గుర్తు చేశారు. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వర రావును మోడీ స్మరించుకున్నారు.భారత సినీ పరిశ్రమకు కొత్త దారులు చూపిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. సినీ పరిశ్రమపై నాగేశ్వర రావు ప్రభావం నేటికీ ఉందన్నారు.
Also Read :Koneru Humpy : ర్యాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. ఐదో స్థానంలో తెలంగాణ కుర్రాడు అర్జున్
భారత సంప్రదాయాలు, విలువలను తెలుగు సినిమాల్లో అద్భుతంగా, అందంగా చూపించిన ఘనత ఏఎన్నార్ లాంటి నటులకే దక్కుతుందని మోడీ కొనియాడారు. ఏఎన్నార్‌తో పాటు బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్‌కపూర్‌ల ప్రస్థానాన్ని(Mann Ki Baat) కూడా ప్రధానమంత్రి ఈసందర్భంగా ప్రస్తావించారు. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమావేశాలను 2025 సంవత్సరంలో మన దేశంలో నిర్వహించబోతున్నామని ప్రధాని వెల్లడించారు. ఈ సమావేశాల్లో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని చెప్పారు. దీనిపై అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు గురించి మాట్లాడినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. ఏఎన్నార్ దూరదృష్టితో భారత సినిమాకు చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
Also Read :Plane Crash : మా దేశ విమానాన్ని కూల్చింది రష్యానే : అజర్‌బైజాన్ అధ్యక్షుడు
వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభ మేళాను ఐక్యతా మేళాగా ప్రధాని మోడీ అభివర్ణించారు. దీని టూర్ ప్యాకేజీలు, వసతి సహా సమస్త సమాచారాన్ని భక్తులు తెలుసుకునేందుకు ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఏఐ ఛాట్‌బాట్ 11 భాషల్లో ఉంటుందని తెలిపారు. కుంభమేళాలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ఏఐ కెమెరాలు, డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.