Premalu : తెలుగు రాష్ట్రాల్లో ప్రేమలు పరిస్థితి ఏంటి..?

Premalu గిరిష్ ఏడి డైరెక్షన్ లో నెస్లెన్, మమితా బిజు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్చి 8న తెలుగులో రిలీజైన ఈ సినిమా

Published By: HashtagU Telugu Desk
Super Hit Premalu Rejected by Small Screen Audience

Super Hit Premalu Rejected by Small Screen Audience

Premalu గిరిష్ ఏడి డైరెక్షన్ లో నెస్లెన్, మమితా బిజు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్చి 8న తెలుగులో రిలీజైన ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఇక్కడ యూత్ ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన గామి, భీమా పెద్దగా సందడి చేయలేదు. గామి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా ప్రేమలు సినిమా తాకిడికి తట్టుకోలేదు.

ప్రేమలు సినిమాకు రాజమౌళి, మహేష్ ఇచ్చిన బూస్టింగ్ సినిమా వసూళ్లకు సపోర్ట్ చేశాయి. ఇప్పటివరకు ప్రేమలు సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 10 కోట్ల గ్రాస్ దాకా కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళ సినిమాల రికార్డులన్నీ కూడా ప్రేమలు బ్రేక్ చేసింది.

ప్రేమలు సినిమాలో హీరోయిన్ మమిత బిజుకి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. అమ్మడి క్యూట్ నెస్ కి తెలుగు యూత్ అంతా కూడా ఫిదా అవుతున్నారు. కచ్చితంగా మమితాకు తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. రిలీజై వారం అవుతున్నా మేజర్ సెంటర్స్ లో ప్రేమలు పర్వాలేదన్నట్టుగా వసూళ్లు రాబడుతుంది.

ఈ ఫ్రై డే రిలీజైన సినిమాల కన్నా ప్రేమలు ఆక్యుపెన్సీ బాగుందని తెలుస్తుంది. ప్రేమలు ఫుల్ రన్ లో మంచి వసూళ్లనే రాబడుతుందని చెప్పొచ్చు. ప్రేమలు తెలుగు వెర్షన్ ను కార్తికేయన్ రిలీజ్ చేయడం ఈ సినిమాకు స్పెషల్ బజ్ ఏర్పడేలా చేసింది.

Also Read : Nandamuri Mokshagna : మోక్షజ్ఞ తెరంగేట్రం.. డైరెక్టర్ ఫిక్స్ అయినట్టేనా..?

  Last Updated: 18 Mar 2024, 12:02 PM IST