Premalu Telugu Trailer మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 60 నుంచి 70 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. మలయాళ సినిమానే అయినా సినిమా మొత్తం హైదరాబాద్ లో తీయడం వల్ల సినిమా తెలుగు వెర్షన్ కి మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ రిలీజ్ చేస్తున్నారు.
ప్రేమలు తెలుగు వెర్షన్ ను మార్చి 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ప్రేమలు సినిమాను గిరీష్ ఏడి డైరెక్ట్ చేయగా నస్లేన్, మమిత, అల్తాఫ్ సలీం, శ్యాం మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు నటించారు.
ఈ సినిమాను ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యాం పుష్కరన్ కలిసి నిర్మించారు. సినిమా మలయాళంలో సెన్సేషనల్ హిట్ కాగా తెలుగులో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మార్చి 8న విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమ రిలీజ్ అవుతున్నాయి. వాటికి ప్రేమలు ఎంత టఫ్ ఫైట్ ఇస్తుందో చూడాలి.
