Premalu OTT Release date మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా ఇటీవలే తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. గిరిష్ డైరెక్ట్ చేసిన ప్రేమలు సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడుకార్తికేయ డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఆదిత్య హాసన్ తెలుగు ప్రేమలు డైలాగ్ వెర్షన్ రాశారు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ప్రేమలు సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నటించిన నెస్లెన్, మమితలకు ఇక్కడ ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ప్రేమలు సినిమా థియేట్రికల్ రన్ నడుస్తుంది. అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రేమలు సినిమాను డిస్నీ + హాట్ స్టార్ డిజిటల్ రైట్స్ కొనేసింది. ఈ సినిమాను మార్చి 29న ఓటీటీ రిలీజ్ లాక్ చేశారు.
తెలుగులో మార్చి 8న రిలీజైన ప్రేమలు 20 రోజుల్లోనే ఓటీటీలో రాబోతుంది. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా కూడా ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది. ప్రేమలు సినిమా తనకు నచ్చిందని సినిమాలో కాస్ట్ అంతా బాగా చేశారని దర్శకధీరుడు రాజమౌళి చెప్పారు. ఇక సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ ఇంతగా ఎప్పుడు నవ్వానో గుర్తు లేదు ఈ సినిమా తెలుగు రిలీజ్ చేసినందుకు థాంక్స్ కార్తికేయ అని ట్వీట్ చేశారు. ప్రేమలు సినిమాలు రాజమౌళి, మహేష్ ఇచ్చిన బూస్టింగ్ సినిమా వసూళ్లపై కనబడుతుంది.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సస్పెన్స్ వీడేది ఆరోజే..!