Site icon HashtagU Telugu

Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ నేచర్ లవర్..!

Premalu Heroine Mamitha Baiju Nature Lover

Premalu Heroine Mamitha Baiju Nature Lover

మలయాళ భామ మమితా బైజు (Mamitha Baiju) ఇప్పుడు సౌత్ అంతా కూడా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమె నటించిన ప్రేమలు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడికి యూత్ ఆడియన్స్ అంతా ఫ్యాన్స్ అయిపోయారు. ప్రేమలు సినిమాలో మమితా నటనకు అందరు ఫిదా అయ్యారు. ఐతే ఆ సినిమా తర్వాత అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నా కూడా ఆచి తూచి అడుగులేస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ మమితా తమిళంలో సినిమాలు చేస్తుంది. తెలుగు ఎంట్రీ కోసం ఇక్కడ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మమితా బైజు ప్రేమలు 2 లో నటిస్తుంది. ప్రేమలు సినిమాల్ సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. ఐతే మరీ లేట్ చేయకుండా ఆ సినిమా ఇలా రిలీజై సక్సెస్ అయ్యిందో లేదో అలా సీక్వెల్ మొదలు పెట్టారు. దాదాపు ఆ కథకు కొనసాగింపుగానే ప్రేమలు 2 (Premalu 2) ఉంటుందని టాక్.

ఇక ఆ సినిమా చూసిన తర్వాత మమితా బైజు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. అమ్మడు రెగ్యులర్ యాక్టివిటీస్ ని కూడా వైరల్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ఇక తన ఫ్యాన్స్ కోసం అమ్మడు నేచర్ (Nature Lover) తో తను దిగిన ఫోటోలను పంచుకుంది మమితా. నేచర్ లవర్ అయిన మమితా ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తుంది. అసలే రెయినీ సీజన్ అందులోనూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. అందులో మమితా ఇది చాలదా ఆమె ఫ్యాన్స్ కి.. మమితా షేర్ చేసిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అమ్మడి తెలుగు ఎంట్రీ కోసం తెలుగు ఆడియన్స్ అంతా ఈగర్ గా ఉన్నారు. మరి మమితా తెలుగు ఎంట్రీ ఎవరితో ఉంటుందో చూడాలి.