Site icon HashtagU Telugu

Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ అసలు పేరు అది కాదా.. ఇంతకీ ఆ సీక్రెట్ పేరేంటి..?

Mytri Movie Makers Picks Premalu Mamitha Baiju

Mytri Movie Makers Picks Premalu Mamitha Baiju

Mamitha Baiju మలయాళంలో ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మమితా బైజు ప్రస్తుతం సౌత్ అంతా కూడా ట్రెండింగ్ లో ఉంది. ప్రేమలు సినిమాలో ఆమె చేసిన క్యూట్ యాక్టింగ్ కు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ప్రేమలు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మమితా బైజు ఇదివరకు సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన ప్రణయ విలాసం సినిమా లేటెస్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఇక ఇదిలాఉంటే మమితా బైజు ప్రేమలు సక్సెస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేరులో ఉన్న ట్విస్ట్ చెప్పి షాక్ ఇచ్చింది. మమితాకు వాళ్ల పేరెంట్స్ నమితా అని పెట్టాలని అనుకున్నారట. కానీ హాస్పిటల్ లో బర్త్ సర్టిఫికెట్ టైం లో ఎన్ బదులుగా ఎం రాయడంతో నమిత కాస్త మమితా అయ్యింది. స్కూల్ లో జాయినింగ్ టైం లో తన పేరు నమిత కాదు మమితా అని గుర్తించారట.

సో అలా నమితా కాస్త మమితా అయ్యింది. అయితే మమితా అంటే మలయాళంలో మిటాయి అనే అర్ధం వస్తుందట. సో అది కూడా బాగానే ఉందని మమితా పేరునే కొనసాగించారట. మొత్తానికి నమిత అవ్వాల్సిన అమ్మడు మమితగా సినీ పరిశ్రమలో తన సత్తా చాటుతుంది. ప్రేమలు సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా సీక్వల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రేమలు 2ని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.