Site icon HashtagU Telugu

Mamitha Baiju : హిట్టు పడింది రెమ్యునరేషన్ డబుల్ చేసింది.. వారెవా..!

Premalu Beauty Mamitha Baiju Dobule Her Remuneration

Premalu Beauty Mamitha Baiju Dobule Her Remuneration

Mamitha Baiju మలయాళ భామ మమితా బైజు ప్రేమలు సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగు, తమిళంలో కూడా డబ్ చేసి రిలీజ్ చేసే సరికి సినిమా మరింతమందికి రీచ్ అయ్యింది. తెలుగులో మమితాకు సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.

తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి మమితా బైజు చాలా ఎమోషనల్ అయ్యింది. ఇదిలాఉంటే హిట్టు పడి క్రేజ్ వచ్చే సరికి అమ్మడు డిమాండ్ చేయడం మొదలు పెట్టిందని తెలుస్తుంది.

ఏ హీరోయిన్ అయినా హిట్ తో రెమ్యునరేషన్ పెంచేస్తారు. ఇక ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పడితే అందుకు తగిన పారితోషికం కూడా వసూళు చేస్తారు. అంతకుముందు మలయాళంలో ఐదారు సినిమాల దాకా చేసిన మమితా బైజు పెద్దగా పాపులర్ అవ్వలేదు. కానీ ప్రేమలు సినిమా ఆమెకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. తెలుగులో ప్రేమలు హిట్ అయ్యే సరికి ఆమెకు మరింత పాఉలారిటీ వచ్చింది.

అందుకే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునేలా తన రెమ్యునరేషన్ డబుల్ చేసిందట అమ్మడు. మొన్నటిదాకా సినిమాకు 30 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకున్న మమితా బైజు తన నెక్స్ట్ సినిమాకు 60 లక్షల రెమ్యునరేషన్ అడిగినట్టు తెలుస్తుంది. అమ్మడి డిమాండ్ చూసి మేకర్స్ కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ప్రేమలు తర్వాత తమిళంలో రెబల్ సినిమాలో నటించింది మమితా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read : Om Bheem Bush Two Days Collections : ఓం భీం బుష్ రెండు రోజుల వసూళ్ల లెక్క ఇదే..!