Site icon HashtagU Telugu

AP: ‘ప్రేమ వాలంటీర్’ గా మారిన జబర్దస్త్ నటుడు..హెచ్చరిస్తున్న వైసీపీ నేతలు

Prema Volunteer Trailer

Prema Volunteer Trailer

వాలంటీర్ ( Volunteer)..ఈ పేరు వింటే ఏపీ రాష్ట్ర ప్రజలే కాదు..అధికార పార్టీ వైసీపీ సైతం భయపడుతుంది. వాలంటీరి వ్యవస్థ తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకున్న జగన్ కు కొంతమంది వాలంటీర్లు చేసే పనుల వల్ల చెడ్డ పేరు రావడమే కాదు విమర్శల పలు చేస్తుంది. కొంతమంది హత్యలు , మానభంగాలు , దోపిడీలు ఇలా పలు నేరాలు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వీరికి ఇచ్చే జీతం సరిపోకా, ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని కొంతమంది అంటున్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట ఏదోక నేరానికి వాలంటీర్ పాల్పడుతున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీరి గురించే మాట్లాడుకుంటూ..ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో జబర్దస్త్ ఫేమ్ ఇమ్మానుయేలు (Jabardasth Emmanuel) హీరోగా మారడం..అతడు నటిస్తున్న వెబ్ సిరీస్ కు ప్రేమ వాలంటీర్ (Prema Volunteer) అని పేరు పెట్టడం ఇప్పుడు ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది. ‘జబర్దస్త్’షో ద్వారా పాపులర్ అయినా నటుల్లో ఇమ్మానుయేలు ఒకరు. షో లో తనదైన కామెడీ ని పండిస్తూ..పంచ్ డైలాగ్స్ వేస్తూ..అతి తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని అభిమానులుగా మార్చుకోగలిగాడు. కేవలం టీవీలోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రకరకాల వీడియోలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు ఇమ్మానుయేలు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు.

‘ప్రేమ వాలంటీర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు ఇమ్మానుయేలు. ఈ వెబ్ సిరీస్‌కు ‘జబర్దస్త్’ బాబు రచన, దర్శకత్వం వహిస్తుండగా.. ఇమ్మానుయేలుకు జోడీగా విజయ విజ్జు నటించింది. వెంకీ వీణ పాటలు, నేపథ్య సంగీతం స్వరపరిచారు. ఈ వెబ్ సిరీస్ కు సంబదించిన ట్రైలర్ శుకవారం విడుదల చేయగా సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో ఇమ్మానుయేలు గ్రామ వాలంటీర్‌గా కనిపించాడు. ఈ గ్రామ వాలంటీర్ అదే గ్రామంలోని అమ్మాయిని ప్రేమలో పడేసే ప్రేమ వాలంటీర్‌గా మారిపోయాడు.

ట్రైలర్ చూసిన వైసిపి (YCP) మద్దతుదారులు ఇమ్మానుయెల్ ను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రామ వాలంటీర్ల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి సమయంలోనే వాలంటీర్ మీదే వెబ్ సిరీస్ తీయడం అనేది మరింత వివాదానికి తెరలేపినట్లు అవుతుంది. అందుకే ఇమ్మానుయెల్ ను వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు . తేడా వస్తే నీ పని అంతే అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్లు కూడా పెడుతున్నారు. మరొకవైపు ఇమ్మానుయేల్ అభిమానులు మాత్రం హీరోగా మొదటి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందా..లేదా అనేది చూడాలి.

Read also : Rahul Sipligunj: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆర్ఆర్ఆర్ సింగర్, గోషామహల్ నుంచి పోటీ?

Exit mobile version