Chiranjeevi : జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి పాత్ర.. ఆ హీరోయిన్ చేయాల్సిందట..

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి పాత్రని ఆ హీరోయిన్ చేయాల్సింది. కానీ..

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 01:14 PM IST

Jagadeka Veerudu Athiloka Sundari : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం సృష్టించింది. ఈ మూవీలో స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చిన దేవకన్య పాత్రలో శ్రీదేవి (Sridevi) నటించారు.

అప్పటి నుంచి శ్రీదేవిని అతిలోకసుందరి అంటూనే పిలుస్తూ వచ్చారు ప్రేక్షకులు. అంతలా ఆ పాత్ర శ్రీదేవి కెరీర్ లో నిలిచిపోయింది. అయితే ఆ పాత్రని శ్రీదేవి కాకుండా మరో హీరోయిన్ చేయాల్సి ఉందట. ఆమె కాదు అనడంతో ఆ పాత్ర శ్రీదేవికి వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె ఎందుకు నో చెప్పారు..?

కన్నడ భామ ‘ప్రేమ’ అందరికి గుర్తుకు ఉండే ఉంటారు. తెలుగులో ధర్మచక్రం, దేవి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1995లో కన్నడ సినిమాలో నటించి ప్రేమ తన కెరీర్ ని స్టార్ట్ చేసారు. అదేంటి ఈమె 1995లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అంటున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా 1990లో రిలీజ్ అయ్యింది కదా అనే సందేహం వస్తుంది కదా..!

అసలు విషయం ఏంటంటే, ప్రేమ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి ఓకే చెప్పి ఉంటే.. అదే ఆమె డెబ్యూ అయ్యేది. కానీ అప్పుడు ఆమెకు హీరోయిన్ అవ్వాలని లేదు. ప్రేమ ఎయిర్‌హోస్టెస్‌ అవ్వాలని అనుకున్నారు. కానీ ప్రేమ తల్లి మాత్రం.. ఆమెను నటిగా చూడాలని అనుకున్నారు. దీంతో కొన్నాళ్ళు తల్లికి, ప్రేమకి మధ్య గొడవ జరిగిందట. ఆ సమయంలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి ఆఫర్ వచ్చింది.

ఇక ఈ ఆఫర్ కి ప్రేమ నో చెప్పడంతో శ్రీదేవికి వెళ్ళింది. అది మాత్రమే కాదు, ఆ నెక్స్ట్ ఇయర్ 1991లో వచ్చిన ‘క్షణం క్షణం’ సినిమాలో శ్రీదేవి చేసిన పాత్ర కూడా ప్రేమ చేయాల్సిందట. కానీ దానికి ఆమె నో చెప్పారు. ఆ రెండు సినిమాలను చేయనందుకు ప్రేమ ఇప్పటికి బాధపడుతుంటారు.

Also read : Vijay Deverakonda : నెటిజెన్ పోస్టుతో.. విజయ్, రష్మిక వెకేషన్ బయటపడిపోయిందిగా..