Preeti Jhangiani’s Husband : ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు నిత్యం రోడ్డు ప్రమాదాలు (Road Accidents) , మహిళలపై అఘాయిత్యాలు ఇవే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు , కోర్ట్ లు జాగ్రత్తలు , కఠిన శిక్షలు , నియమాలు చెపుతున్నప్పటికీ ఇవి మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే అతివేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం మత్తు , ముద్రమత్తులో ప్రమాదాలు అనేవి చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా హీరోయిన్ భర్త కు ఆలాంటి ప్రమాదమే జరిగింది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన తమ్ముడు (Tammudu) మూవీ లో నటించిన ప్రీతీ జంగ్యాని (Preeti Jhangiani) భర్త (Parvin Dabas)కు యాక్సిడెంట్ జరిగింది. శనివారం ఉదయం పర్వీన్ దబాస్ కార్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే అతన్ని బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం పర్వీన్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పర్వీన్ ప్రో పంజా లీగ్ కో ఫౌండర్ కూడా. ప్రో పంజా లీగ్ సభ్యులు పర్వీన్ దబాస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతను చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారు. అతని ఆరోగ్యం గురించి మేము రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తాము అని తెలిపారు.
ఇక భర్త యాక్సిడెంట్ కి గురయ్యాడని తెలిసి ప్రీతీ జంగ్యాని హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్ళింది. అతని ఫ్యామిలీ మెంబర్స్, ప్రో పంజా లీగ్ మెంబర్స్ ప్రస్తుతం హాస్పిటల్ ల్లోనే ఉన్నారు. అభిమానులు, పలువురు సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రీతీ జంగ్యాని విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్, ప్రశాంత్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున, సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, గోవిందా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రాజేంద్ర ప్రసాద్, జె. డి. చక్రవర్తి, ఉపేంద్ర, జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లరి నరేష్ వంటి నటులతో కలిసి పనిచేసింది. బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక.. బాలీవుడ్ నటుడు, దర్శకుడు పర్వీన్ దబాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని , సినిమాలకు దూరమైంది.
Read Also : Balakrishna at Venky Movie Sets : వెంకీ సెట్లో బాలయ్య సందడి..