Site icon HashtagU Telugu

Prathinidhi 2 Teaser : నారా రోహిత్ ‘ప్రతినిధి-2’ టీజర్ టాక్

Prathinidhi2 Teaser

Prathinidhi2 Teaser

యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2′(Prathinidhi 2). పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విడుదల చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి (Murthy Devagupthapu) ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని వానరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. నారా రోహిత్ .. సినీ ప్రియులకు ఇటు నందమూరి అభిమానులకు అలాగే టీడీపీ శ్రేణులకు సుపరిచితమే. బాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి హీరోగా వెండి స్క్రీన్ ఫై కనిపించిన రోహిత్..మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఈయన..చాల ఏళ్ల తర్వాత ‘ప్రతినిధి-2’ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ జర్నలిస్ట్‌ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్‌ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా..ఇక ఇప్పుడు ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసి మెప్పించారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసి సినిమా ఫై మరింత హైప్ తెచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

‘జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం’ వంటి డైలాగ్లతో టీజర్ ఆకట్టుకుంది. రాష్ట్రంలో అప్పుల్లో ఉంది..ఆ అప్పు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది..అభివృద్ధి ఉంటె ఎంత సేపు..అందుకే దయచేసి అలోచించి ఓటు వెయ్యండి ..లేదంటే దేశం వదిలిపెట్టండి..ఈ డైలాగ్స్ అన్ని వింటుంటే ప్రస్తుతం ఏపీలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి మూర్తి రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ పార్టీలను బేస్ చేసుకొని సినిమా తెరకెక్కించారా..? లేక దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారా..? అనేది అందరిలో సందేహం గా మారింది. మరి సినిమా రిలీజ్ అవుతే కానీ అసలు సినిమాలో ఏముందనేది తెలుస్తుంది. ఈ లోపు మీరు టీజర్ చూసెయ్యండి.

Read Also : Alert: రాష్ట్రంలో అత్యధిక ఉష్టోగ్రత నమోదు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్