Prathinidhi 2 : ఆసక్తిరేపుతున్న ‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్​ టీజర్ ..

నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 02:24 PM IST

నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2 ) . టీవీ-5 సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి (TV5 Murthy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ని వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ ను మేకర్స్ విడుదల చేసి ఆసక్తి నింపారు. టీజర్ చూస్తుంటే పొలిటికల్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది.

ఈ టీజర్ (Prathinidhi 2 Concept Video) విషయానికి వస్తే..టీజర్ అంత అంతా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్​.. వార్తాపత్రికలను హైలైట్ చేస్తూ చూపించారు. ఆ పత్రికల్లో ఓట్లు మాయం, యువత రావాలి, హింస పెరిగిపోతోంది వంటి హెడ్​ లైన్స్​ను హైలైట్ చేసారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ బ్లాస్​ జరిగి అది పేలిపోతుంది. దాని వెనకే.. వేల మంది జనం ఉన్న పొలిటికల్ మీటింగ్ సభ ఒకటి జరుగుతున్నట్లు చూపించారు. సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్​ పోస్టర్​ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే ఇది పక్క పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ గా అర్ధం అవుతుంది.

వీరభోగ వసంత రాయలు సినిమా తర్వాత నారా రోహిత్ (Nara Rohith) నుండి వస్తున్న సినిమా ఇది. జనవరి 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also: బ్రహ్మాజీ కూడా శ్రీలీలనే కోరుకుంటున్నాడు