Prasanth Varma : ‘జై హనుమాన్’ పక్కన పెట్టిసిన ప్రశాంత్ వర్మ..? అనుపమతో సినిమా.. ఆల్రెడీ షూటింగ్..?

తాజా సమాచారం ప్రకారం జై హనుమాన్ సినిమాని పక్కన పెట్టాడని తెలుస్తుంది

Published By: HashtagU Telugu Desk
Prashanth Varma Stopped Jai Hanuman Movie and Started Anupama Parameswaran Movie

Prashanth Varma Stopped Jai Hanuman Movie and Started Anupama Parameswaran Movie

ఇటీవల ‘హనుమాన్'(Hanuman) సినిమాతో ఒక్కసారిగా ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma). మొదట్నుంచి కూడా డిఫరెంట్ సినిమాలని తీసుకొస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 50 రోజులకు పైగా థియేటర్స్ లో ఆడి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది.

ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమా తెరకెక్కిస్తానని, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే షూట్ మొదలుపెడతానని తెలిపాడు ప్రశాంత్ వర్మ. కానీ తాజా సమాచారం ప్రకారం జై హనుమాన్ సినిమాని పక్కన పెట్టాడని తెలుస్తుంది. అందులో నటించే ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో కొన్నాళ్ళు ఆ సినిమాని పక్కన పెట్టినట్టు టాలీవుడ్ సమాచారం.

అయితే జై హనుమాన్ సినిమా పక్కన పెట్టి అనుపమ పరమేశ్వరన్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడట. అనుపమ పరమేశ్వరన్ తో ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ అనే సినిమాని తీస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా సగం పైగా షూటింగ్ అయిపోయిందని తెలుస్తుంది. దీంతో జై హనుమాన్ నటీనటుల డేట్స్ వచ్చేవరకు ఆక్టోపస్ సినిమా పూర్తిచేసి రిలీజ్ కి రెడీ చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అనుపమ త్వరలోనే టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది.

 

Also Read : Manchu Vishnu : తెలుగు పరిశ్రమ 90 ఏళ్ళ సినీ ఉత్సవం.. మంచు విష్ణు ఆధ్వర్యంలో.. ఎక్కడో తెలుసా?

  Last Updated: 23 Mar 2024, 02:18 PM IST