Site icon HashtagU Telugu

Prasanth Varma Mahakali: పీవీసీయూలో మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేసిన ప్రశాంత్ వర్మ

Prasanth Varma Mahakali

Prasanth Varma Mahakali

Prasanth Varma Mahakali: హనుమాన్ తర్వాత, ప్రశాంత్ వర్మ యొక్క సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా రాబోతుంది. ఈ సినిమాను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సూపర్ హీరో మూవీకి “మహాకాళీ” అనే టైటిల్‌ను నిర్ధారించారు. మహాకాళీ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది.

వెస్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో:

వీడియో చివర్లో ఓ పెద్ద పులికి తల పెట్టి చిన్నారి కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక దేవాలయము మరియు బ్రిడ్జ్ చూపిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతున్నట్లు సమాచారం. కాళీమాత శక్తి మరియు శౌర్యాలను మోడ్రన్ టచ్‌లో ఈ మూవీలో చూపించబోతున్నారని తెలుస్తోంది. చెడుపై యుద్ధం చేసేందుకు కాళీకాదేవి వస్తుందని సినిమా గురించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.

పూజ కొల్లూరు దర్శకత్వంలో:

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన “మార్టిన్ లూథర్ కింగ్” సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా అడుగు పెట్టింది పూజ కొల్లూరు. ఇది ఆమెకు రెండో సినిమా. మహాకాళీ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ మరియు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీలో మహాకాళీ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ హీరోయిన్ ఎవరో ప్రశాంత్ వర్మ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆమె గురించి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

పీవీసీయూలో మూడవ సినిమా:

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతున్న ఈ మూవీ మూడవది. ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో మొదటి మూవీగా “హనుమాన్” రూపొందగా, రెండవ మూవీగా నందమూరి నటసింహం బాలయ్య వారసుడు “నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ”ని ప్రకటించారు. నాలుగవ సినిమా గా డీవీవీ దానయ్య తనయుడు హీరోగా నటిస్తున్న “అధీరా” త్వరలో వస్తుంది.