Prashanth Neel : కోలీవుడ్ స్టార్ తో ప్రశాంత్ నీల్ మూవీ.. ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

కె.జి.ఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అంటే చాలు స్టార్స్ అంతా కూడా రెడీ అనేస్తున్నారు. కె.జి.ఎఫ్ తర్వాత ప్రభాస్ తో సలార్ పార్ట్ 1 తీసిన ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో కూడా

Published By: HashtagU Telugu Desk
Prashanth Neel Movie With Kollywood Star Hero Ajith

Prashanth Neel Movie With Kollywood Star Hero Ajith

కె.జి.ఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అంటే చాలు స్టార్స్ అంతా కూడా రెడీ అనేస్తున్నారు. కె.జి.ఎఫ్ తర్వాత ప్రభాస్ తో సలార్ పార్ట్ 1 తీసిన ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో కూడా తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) తో సలార్ 2ని పూర్తి చేసి ఎన్.టి.ఆర్ సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ఈలోగా కోలీవుడ్ స్టార్ అజిత్ తో ప్రశాంత్ నీల్ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ లో స్టార్డం ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. ఆయన తీసే సినిమాలన్నీ అక్కడ వరుస హిట్లు అవుతున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

అయితే అజిత్ పాన్ ఇండియా డ్రీం కోసం ప్రశాంత్ నీల్ తో కలిసి పనిచేయాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. అజిత్ ఒకప్పుడు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వలేదు. అజిత్ ప్రశాంత్ నీల్ సినిమా వస్తే తల ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.

ప్రశాంత్ నీల్ ఓ పక్క కె.జి.ఎఫ్ 3 (K.G.F) ని కూడా చేయాలని అనుకుంటున్నాడు. అయితే కె.జి.ఎఫ్ 3 కన్నా ముందు సలార్ 2 ని పూర్తి చేయాలని చూస్తున్నాడు. సలార్ 2 రిలీజ్ తర్వాతే తన నెక్స్ట్ సినిమా ఏదన్నది డిసైడ్ అవుతాడట. ఐతే ప్రభాస్ సలార్ 2 కన్నా ముందు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. కల్కి, రాజా సాబ్ రిలీజ్ ల తర్వాతే సలార్ 2 కోసం అతను డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది.

Also Read : Na Samiranga King Size Hit : నా సామిరంగ నాగార్జున ‘కింగ్’ సైజ్ హిట్..!

  Last Updated: 22 Jan 2024, 05:33 PM IST