Site icon HashtagU Telugu

Jai Hanuman: ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో చిరు, మహేష్ కాంబో..

Hanuman

Hanuman

Jai Hanuman: టాలీవుడ్ సంచలన దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన హనుమాన్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుదలై పాజిటిక్ టాక్ తో భారీ వసూళ్లను రాబడుతుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పటి వరకు 260 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంతటి విజయాన్ని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఈ చిత్రం 300 కోట్ల వైపు దూసుకెళుతోంది. దీంతో ప్రశాంత్ వర్మకు డిమాండ్ పెరిగింది. బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ రూపొందించనున్నారు. ఆల్రెడీ స్టోరీ లాక్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

అయితే.. ఈ మూవీలో రాముడు పాత్ర, ఆంజనేయస్వామి పాత్ర ఉంటుందట.. ఆ రెండు పాత్రలను కూడా తెలుగు హీరోలతోనే చేయించాలని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ ఎవరంటే.. రాముడు పాత్రలో మహేష్ బాబు, ఆంజనేయస్వామి పాత్రలో చిరంజీవి నటిస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ తన మనసులో మాటలను బయటపెట్టాడు. ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రాముడుగా మహేష్ చేస్తేనే బాగుంటుందని.. తన టీమ్ లో ఉన్న వారందరూ ఇదే అనుకున్నామని.. మహేష్ ని రాముడు గెటప్ లో ఎలా ఉంటాడో చూసామని కూడా చెప్పారు.

ఇక ఆంజనేయస్వామి పాత్రకు చిరంజీవి గారు కరెక్ట్ గా సరిపోతారని.. ఆయనే నటించవచ్చు అని కూడా ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన బిజీ అయిన తర్వాత వెళ్లి కలుస్తానని… అలాగే ఆంజనేయస్వామి పాత్ర గురించి కూడా చర్చిస్తానని చెప్పాడు. ఇలా జై హనుమాన్ మూవీలో చిరంజీవి, మహేష్ బాబు నటించే అవకాశం ఉందని టాక్ బయటకు రావడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీలో చిరంజీవి, మహేష్ నటిస్తే.. సంచలనమే.

Also Read: Telangana: ఫామ్‌హౌస్‌లో మోడీతో కేసీఆర్ రహస్య చర్చలు