Jai Hanuman : జై హనుమాన్ కొత్త పోస్టర్ చూసారా.. ఇదే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక మూవీ..

జై హనుమాన్ కొత్త పోస్టర్ చూసారా. ఒక చిన్న పోస్టర్ లోనే ఇంత గ్రాండ్ విజువల్ కనిపిస్తుంటే, రేపు సినిమాలో..

Published By: HashtagU Telugu Desk
Prasanth Varma Releases Jai Hanuman New Poster

Prasanth Varma Releases Jai Hanuman New Poster

Jai Hanuman : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్దకి ఓ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన ఈ చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చి ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్ చూపించి ఆడియన్స్ నుంచి ఫిలిం మేకర్స్ వరకు అందరినుంచి ప్రశంసలు అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.

కాగా ఈ మూవీ చివరిలో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ దర్శకుడు ముగింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అనే ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక మొదటి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు. తక్కువ ఖర్చుతో తీసిన హనుమాన్ లోనే ఓ రేంజ్ విజువల్స్ చూపించిన టీం.. గ్రాండ్ గా చేయబోతున్న సీక్వెల్ లో ఇంకెలాంటి విజువల్స్ చూపించనున్నారో అనే ఆసక్తి అందరిలో ఉంది.

ఇది ఇలా ఉంటే, నేడు శ్రీరామనవమి పండుగ కావడంతో మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో ఆంజనేయుడు రాములోరికి ప్రమాణం చేస్తున్న చేతులు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్టర్ చూడడానికి చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఒక చిన్న పోస్టరే ఇలా ఉంటే.. రేపు సినిమాలో ఇంకే రేంజ్ విజువల్స్ ఉండబోతున్నాయో అని మరింత క్యూరియాసిటీ పెరిగింది. కాగా ఈ పోస్టర్ షేర్ చేస్తూ ప్రశాంత్ వర్మ.. గొప్ప సినిమా ఇస్తానని, ఆడియన్స్ ని నిరాశ పరచనని ప్రమాణం చేసారు.

  Last Updated: 17 Apr 2024, 11:21 AM IST