Site icon HashtagU Telugu

Pranitha Baby Shower: బాపుగారి బొమ్మ సీమంతం ఫోటోలు వైరల్..!!

pranitha baby shower

pranitha baby shower

ప్రణీత సుభాష్….ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో ప్రణీత్ రెండవ కథనాయిక రోల్ లో యాక్ట్ చేసింది. ఎన్టీఆర్ కి జంటగా రామయ్య వస్తావయ్యా మూవీలో నటించింది. అయితే ఈ సినిమా అంతగా గుర్తింపునివ్వలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా పొందనప్పటికీ…ప్రణీత అడపాదడపా సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం ప్రణీత సుభాష్ గర్భవతి. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. సంప్రదాయం ప్రకారం సీమంతం వేడకను కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. పసుపు పచ్చపట్టు చీరల ప్రణీత చూడముచ్చటగా కనిపించింది. తన సీమంతం వేడుక ఫోటోలను ప్రణీత తన ఇన్ స్టాలో షేర్ చేసింది. తన ఫ్యాన్స్ తో పాటు సినీప్రముఖులు ప్రణీతకు శుభాకాంక్షలు తెలిపారు. పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తున్నారు.

కాగా గతేడాది మే 30న బిజినెస్ మెన్ నితిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోవిడ్ కారణంగా తన వివాహానికి సంబంధించి అప్ డేట్ఇ వ్వకుండా…కొంతమంది సమక్ష్యంలోనే వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రణీత ఇన్ స్టా ద్వారానే వెల్లడించింది.