Site icon HashtagU Telugu

Praneetha:తల్లి కాబోతున్న ప్రణీత..ఇన్ స్టాలో వెరైటీ అనౌన్స్ మెంట్..!!

Pranitha Subhash Pregnant

Pranitha Subhash Pregnant

హీరోయిన్ ప్రణీత…తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన భర్తతో కలిసి ప్రకటించింది. స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తూ తాను గర్భవతినని చెప్పింది. ఆ ఆనంద క్షణాలను ప్రణీత దంపతులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రణీత తన భర్త నితిన్ రాజు పుట్టిన రోజు సందర్భంగా..అతనికి నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ అంటూ పేర్కొంది.

ఇక ప్రణీత బెంగుళూరు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును మే 30, 2021న వివాహం చేసుకుంది. అయితే కోవిడ్ సమయంలో తన వివాహం జరగడంతో…ఈ విషయాన్ని తన అభిమానులకు ఇన్ స్టా వేదికగా ప్రకటించింది. దగ్గర బంధువుల సమక్షంలో తన వివాహం జరిగినట్లు పేర్కొంది. ప్రణీత 2010లో బావ మూవీతో తెలుగు ఇండస్ట్రీకిలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అత్తారింటికి దారేదీ, బ్రహ్మెుత్సవం సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన కథనాయకుడు సినిమాలో చివరిసారిగా కనిపించింది ప్రణీత.

 

Exit mobile version