Prakash Raj : కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. సినిమా ఆడవాళ్లంటే చిన్నచూపా?

తాజాగా ప్రకాష్ రాజ్ కొండా సురేఖ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఫైర్ అయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Prakash Raj Sensational Tweet on Konda Surekha

Konda Surekha

Prakash Raj : ఇటీవల కొంతమంది బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు కొండా సురేఖని(Konda Surekha) టార్గెట్ చేసి ట్రోల్ చేయడంతో నేడు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య విడాకులు కేటీఆర్ వల్లే అయ్యాయని, చాలా మంది హీరోయిన్స్ కేటీఆర్ వల్లే సినీ పరిశ్రమను వదిలేసి వెళ్లిపోయారని, హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసాడని.. ఇలా అనేక సంచలన ఆరోపణలు కేటీఆర్(KTR)ని ఉద్దేశించి కొండా సురేఖ చేసింది.

ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కొండా సురేఖ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఫైర్ అయ్యాడు. తన సోషల్ మీడియాలో కొండా సురేఖ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసి.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? అంటూ ప్రశ్నించాడు. దీంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇటీవల లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శిస్తూ వరుస ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం – మంత్రి కొండా సురేఖ

  Last Updated: 02 Oct 2024, 04:19 PM IST